తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 14:59

తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట..ఇండ్లలోకి చేరిన నీరు

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో నిజాంసాగర్‌ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపో యింది.

దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది. మధ్య రాత్రి వేళ ఒక్కసారిగి నీరు ఇండ్లలోకి రావడంతో కాలనీవాసులు పరుగులు పెట్టారు.

నీటి ప్రవాహానికి విద్యుత్‌ స్తంభాలు కింద పడిపోయా యి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపో యింది. అయితే కాలువ తెగిపోవడానికి ఇరిగేషన్‌ అధికారుల నిరక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

అధికారులు తక్షణమే సహా యక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో.. నీటిపారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంది.

అయితే ఆర్మూర్‌ ప్రాంతం లోని అధికారులు అవేవీ పట్టించుకోలేదు. దీంతో ప్రధాన కాలువ మురికి కూపంలో తయారై చెత్తా చెదారంతో నిండిపోయింది. కాగా,

ప్రజలకు తాగురు, రైతులకు సాగునీటి కోసం ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీటిని వదిలారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో కాలువ తెగిపోయిందని చెప్పారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 31 2024, 16:47

చెప్పు విసరడం దాడి కాదు... భావ ప్రకటన స్వేచ్ఛ: వైరల్‌గా మారిన గౌతం సవాంగ్‌ వ్యాఖ్యలు

అమరావతి: అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని గుత్తిలో గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరిన నేపథ్యంలో...

గతంలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జగన్‌ ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేసి, కక్ష సాధింపు చర్యలకు దిగినప్పుడు రైతులకు భరోసా ఇచ్చేందుకు తెదేపా అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. వైకాపా ప్రేరేపిత దుండగులు కొందరు ఆయన వాహనంపై కర్రలు, చెప్పులు విసిరారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిపై దాడిని తీవ్రంగా పరిగణించి, దుండగులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌... అది దాడి కాదని, వారి భావప్రకటన స్వేచ్ఛ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, చెప్పులు విసరడం కూడా ఒక విధమైన భావప్రకటన స్వేచ్ఛే అన్నట్టు మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 31 2024, 16:44

సీఎం జగన్‌ మహానటుడు: నారా లోకేశ్‌

అమరావతి: తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని చెప్పారు.

ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో స్థానికులతో ఆయన సమావేశమై మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో తొమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. ఇంటి పన్ను, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తాము తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ మద్య నియంత్రణ పాలసీని తీసుకొస్తామని, వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సీఎం జగన్ రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వస్తే ఆస్కార్‌తో పాటు భాస్కర్ అవార్డులు వస్తాయని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని హత్య చేసి ఆ నెపాన్ని కుటుంబ సభ్యులపై వేసిన మహానటుడని లోకేశ్‌ విమర్శించారు. కేంద్ర హోంశాఖ లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన నేపథ్యంలో ఈ సమావేశానికి సీఆర్పీఎఫ్ (వీఐపీ వింగ్) సిబ్బంది ఆయన వెంట వచ్చారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 31 2024, 16:39

తెదేపాలో చేరాడని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి!

మందస: శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. ఆరు నెలల క్రితం వైకాపా నుంచి తెదేపాలో చేరానని.. అప్పటి నుంచి అధికార పార్టీ నేతలు తనపై కక్షగట్టారని బాధితుడు ఆరోపించాడు..

వివరాల్లోకి వెళితే.. మందస మండలం గౌడు గురంటికి చెందిన గాడి దేవరాజు ఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్‌ కింద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం వేకువజామున స్వగ్రామం నుంచి విధుల కోసం బైక్‌పై బయలుదేరారు..

ఈ క్రమంలో బుడార్సింగి సమీపంలో కొందరు మాటువేసి తనపై కర్రలతో దాడికి పాల్పడ్డారని బాధితుడు చెప్పాడు. దాడి చేసిన వారిలో సివిల్‌ దుస్తుల్లో పోలీసులు ఉన్నారని తెలిపాడు. తెదేపాలో చేరినందుకు కక్షగట్టి వైకాపా నేతలే దాడి చేయించారని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలంటూ మందస పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించాడు. గాయాలు కావడంతో చికిత్స కోసం అతడిని హరిపురం సీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న పలాస తెదేపా అభ్యర్థి గౌతు శిరీష బాధితుడిని ఓదార్చారు. దేవరాజుపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఆమె కంటతడిపెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 29 2024, 21:11

క్రైస్తవ భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ చర్చిలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరే గించిన అనంతరం మధ్యా హ్నం 2 గంటల వరకు ప్రార్థనలు జరిగాయి.

ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు. శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు. శిలువకు తనకు తానే లోక పాపములను పోగొట్టుటకు శిలువ ఎక్కాడు.

ఆ దినము న పలికిన 7 ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం ఈ రోజు ప్రత్యేకత. చర్చి ప్రేసీబేటరీ ఇన్‌చార్జి రెవరెండ్‌ శాంత య్య దైవ సందేశం చేశారు.

ఏసు శిలువ వేయబడిన తర్వాత తన చివరి ఏడు మాటల గురించి భక్తులకు వివరించారు. ఈ సందర్భం గా ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు.

గుడ్‌ ఫ్రైడే సందర్భంగా మెదక్‌ డయాసిస్‌ పరిధి లోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు భారీగా తరలి రావడంతో చర్చి ప్రాంతం కిటకిటలా డింది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 29 2024, 18:22

లైంగిక వేధింపులతో మరో విద్యార్థిని ఆత్మహత్య

విశాఖ మధురవాడ కొమ్మది లో విద్యార్థినిపై దారుణ లైంగిక వేధింపుల సంఘటన మళ్లీ చోటు చేసుకుంది.ఈ లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య కు దారితీసింది. ఈ సంఘటన సంచలనం రేపింది.

ఇటీవల కాలంలో వరుసగా విశాఖ మధురవాడలో ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్య లు,అత్యాచారాల సంఘట నలు నిత్యకృత్యంగా మారా యి. ఇటీవల ఒక విద్యార్థిని పై పిటి మాస్టర్ అత్యచారం సంఘటన మరవకముందే తాజాగా మరో సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

మధురవాడ ఒక విద్యా సంస్థలో దారుణ లైంగిక వేధింపుల సంఘటన మళ్లీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.ఈ తీవ్ర లైంగిక వేధింపుల సంఘట నలో తన కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదని ఒక అమాయక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

ఆమె ఆత్మహత్య చేసుకుం టూ ముందుగా వాట్సప్ చాటింగ్ ద్వారా సూసైడ్ నోట్ రాసింది. తనకు జరిగిన లైంగిక వేధింపుల సంఘటనలో తాను చదువుకుంటున్న కాలేజీలో విద్యాబుద్ధులు నేర్పించవ లసిన ఫ్యాకల్టీ విద్యార్థులతో చేతులు కలిపి లైంగిక వేధిం పులకు పాల్పడినట్లు పేర్కొంది.

తనలాగే అనేకమంది మహి ళా విద్యార్థులు లైంగిక వేధిం పులకు నిత్యం బలి అవుతు న్నారని తెలిపింది. పోలీసు లకు ఫిర్యాదు చేస్తే రహస్యం గా తీసిన ఫోటోలు, వీడి యోలు సోషల్ మీడియాలో పెట్టి ఆ విద్యార్థిని కుటుంబ పరువును బజారుకీడుస్తా మని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థిని సూసైడ్ నోట్ లో పేర్కొంది.

ఈ ఘటన ఒక్కసారిగా వెలుగు చూడడం తో విద్యార్థులు,తల్లిదండ్రులు భయాందోళనకు గుర య్యారు. విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యా యులే కీచకులుగా మారుతుంటే తల్లిదండ్రుల్లో తమ పిల్లలు పై ఆందోళన మొదలియింది.

మృతురాలు తనకు జరిగిన బాధ ను తన తల్లిదండ్రు లకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించి శుక్రవారం తెల్లవా రుజామున కళాశాల బిల్డింగ్ పై దూకి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 29 2024, 18:20

జగిత్యాల ఎమ్మెల్యే డా" సంజయ్ కుమార్ కు పితృ వియోగం

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తండ్రి సీనియర్ న్యాయవాది హనుమంతరావు (85) కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు..

ఆయన మృతి పట్ల పలు వురు సంతాపం వెలిబు చ్చారు. విషయం తెలుసు కున్న పట్టణ, జిల్లా ప్రము ఖులు ఆయన భౌతిక కాయం సందర్శన కోసం జగిత్యాలకు చేరుకుంటు న్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 29 2024, 16:10

ఐటీ మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన మున్నూరు కాపు సంఘం నాయకులు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమితులైన రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ను శుక్రవారం మున్నూరు కాపు సంఘం మహాసభ నాయ కులు ఘనంగా సన్మానిం చారు.

ఈ మేరకు ఈరోజు హైదరా బాద్ లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జాతీయ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమి తులైన శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మున్నూ రు,కాపు సంఘం మహాసభ అధ్యక్షులు గడ్డి రాజశేఖర్, పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం మహాసభ కన్వీనర్ ఇనుముల సతీష్, భూపాల పల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు తుల్సేగారి తిరుపతి, పటేల్ తది తరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 29 2024, 16:09

టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. మరో లిస్ట్ విడుదల

మరో 4 ఎంపీ సీట్లకు, 9 అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది..

ఎంపీ అభ్యర్థులు:

విజయనగరం-అప్పలనాయుడు,

ఒంగోలు-మాగుంట శ్రీనువాసులు రెడ్డి,

అనంతపూర్- అంబికా లక్ష్మీనారాయణ,

కడప-భూపేష్ రెడ్డి

ఎమ్మెల్యే:

భీమిలి-గంటా శ్రీనివాస్ రెడ్డి,

రాజంపేట-సుభ్రమణ్యం

చీపురుపల్లి-కళా వెంకట్రావు

గుంతకల్లు-గుమ్మనూరు జయరాం

కదిరి-కే.వెంకట ప్రసాద్

పాడేరు-వెంకట రమేష్

దర్శి-గొట్టిపాటి లక్ష్మి

ఆలూరు వీరభద్రగౌడ్

అనంతరపురం అర్బన్-దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 29 2024, 16:06

కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు జారీ

లోక్‌సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ పార్టీకి ఐటీ విభాగం మరో సారి నోటీసులు జారీ చేసింది.

ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా ఈరోజు వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవ త్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

తమపై ఐటీ విభాగం ప్రక్రి యను నిలిపివేయా లంటూ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసు కోవడం గమనార్హం. ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం తాజా నోటీసులిచ్చారని వివేక్‌ తంఖా ఆరోపించారు.

ఇది అహేతుక, అప్రజాస్వా మిక చర్య అని ఆయన మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేం దుకు కేంద్రం ప్రయత్నిస్తోం దని దుయ్యబట్టారు.దీన్ని తాము చట్టపరంగా ఎదు ర్కొంటామని అన్నారు.